పెనుగంచిప్రోలు మండలం ముండ్లపాడు జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మంటలను గమనించిన ప్రయాణికులు కేకలు వేయడంతో బస్సును డ్రైవర్ నిలిపివేశారు. డ్రైవర్‌తో సహా మొత్తం 35 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయి అత్యవసర కిటికీల నుంచి బయటకు దూకేందుకు యత్నించారు. స్థానికులు మంటలను అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. బస్సు విజయవాడ నుంచి కోదాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరొక బస్సు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.