రాజకీయం (Politics) వార్తలు (News)

వైఎస్సార్‌ జగనన్ననగర్ – ఒక్క రూపాయికే టిడ్కో ఇల్లు

అమరావతి పురపాలక సంఘాల్లో షియర్‌వాల్‌ సాంకేతికతతో జీ+3 అపార్ట్‌మెంట్‌ తరహాలో నిర్మించిన 300 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన 1,43,600 ఇళ్లను లబ్ధిదారులకు కేవలం ఒక్క రూపాయికే అందించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే 365 చ.అడుగులు, 430 చ.అ విస్తీర్ణం కలిగిన ఇళ్లకు లబ్ధిదారుల వాటాలో 50 శాతం రాయితీని వర్తింపజేసి, 365 చ.అ ఇంటికి రూ.50 వేలు, 430 చ.అ ఇంటికి రూ.లక్ష తమ వాటాగా లబ్ధిదారులు చెల్లించాల్సి ఉండగా ఇందులో 50 శాతం రాయితీకి అనుమతిచ్చింది. ఇప్పటికే పూర్తిగా చెల్లించినట్టైతే వారికి సగం మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని, లబ్ధిదారుని వాటా ఇప్పటికే చెల్లించినప్పటికీ.. వైకాపా ప్రభుత్వ ఇళ్ల పట్టాల పథకం వైపు మళ్లిన వారికి పూర్తి మొత్తాన్ని చెల్లించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే పూర్తిగా చెల్లించిన వారికి సగం మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. ఇప్పటి వరకు టిడ్కో కాలనీలుగా ఉన్న పథకం పేరును ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన- వైఎస్సార్‌ జగనన్ననగర్‌గా మార్పుచేస్తున్నట్లు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.