టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ICSE, ISC 10, 12వ తరగతి ఫలితాలు విడుదల!!

ఐసీఎస్‌ఈ పదో తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి ఫలితాలను కౌన్సిల్‌ ఫర్‌ ది ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్స్ బోర్డు (సీఐఎస్‌సీఈ) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ ఏడాది ఐసీఎస్‌ఈ పదో తరగతిలో 99.98శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఐఎస్‌సీ 12వ తరగతిలో 99.76శాతం నమోదైంది. కెరీర్స్‌ పోర్టల్‌ ద్వారా టాబ్యులేషన్ రిజిస్ట్రర్లను పాఠశాలలకు అందుబాటులో ఉంచుతున్నట్టు సీఐఎస్‌సీఈ బోర్డు కార్యదర్శి గెర్రీ అరథోన్‌ ఇప్పటికే వెల్లడించారు. అలాగే ఎస్‌ఎంఎస్‌ల ద్వారా కూడా ఈ ఫలితాలు తెలుసుకోవచ్చు.

ఈ ఫలితాలను http://cisce.org లేదా http://results.cisce.org లో అందుబాటులో ఉంచారు. SMS ద్వారా ఫలితాలు పొందడం ఎలా అంటే.. సీఐఎస్‌సీఈ ఫలితాలను తెలుసుకొనేందుకు ఐసీఎస్‌ఈ విద్యార్థులైతే ICSE (Unique ID) టైప్‌ చేసి 09248082883 నంబర్‌కు పంపాలి. అలాగే, ఐఎస్‌సీ 12వ తరగతి విద్యార్థులైతే ISC (unique ID) టైప్‌ చేసి పైన పేర్కొన్న నెంబర్‌కే పంపి ఫలితాలు పొందవచ్చు. అభ్యంతరాలను తెలియజేయడానికి ఆగస్టు 1 వరకు గడువు ఇస్తున్నట్టు సీఐఎసీఈ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఫలితాలతో ఎవరైనా సంతృప్తి చెందకపోతే వారికి కరోనాతో నెలకొన్న పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాక పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇప్పటికే బోర్డు స్పష్టంచేసింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •