టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

నెల్లూరు జిల్లాలో కొత్త జీవి కలకలం!!

ఈ భూమ్మీద మనకి తెలియని వింత జీవులు, చిత్రవిచిత్రాలు చాల ఉన్నాయి. కొన్నిసార్లు
అడవులు, సముద్రాల నుంచి బయటకు వచ్చే జీవులను చూసి ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురవుతుంటారు. ఇలాంటి సంఘటనే ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని పడమటి నాయుడుపల్లిలోని ఓ ఇంట్లో తాడును పోలిన పాములాంటి జీవి కనిపించింది. సన్నగా దారంలా ఉన్న ఈ జీవి వానపాములా పాకుతుంది కానీ వానపాము కాదు. గ్రామంలోని కత్తి కొండమ్మ అనే మహిళ ఇంటిలో తాడులా ఉందని పట్టుకోబోతే కదిలిందని, దీనిని చూసి తొలుత భయం వేసినా హానికరం కాదని తెలిసిన తర్వాత ఊపిరి పీల్చుకున్నట్లు చెప్తున్నారు. ఈ జీవి ఏజాతికి చెందినదో? దీనిని ఏమని పిలుస్తారో? అధికారులే చెప్పాలని స్థానికులు కోరుతున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    91
    Shares
  • 91
  •  
  •  
  •  
  •