క్రైమ్ (Crime) వార్తలు (News)

రాజ్ కుంద్రా కేసులో 70 అశ్లీల వీడియోలు స్వాధీనం చేసుకున్న పోలీస్ లు!!

అశ్లీల వీడియోలు తీసిన కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా కేసును పోలీసులు విచారణ వేగవంతం చేసి పక్కా ఆధారాల కోసం ఆరాతీస్తున్నారు. ఆ అశ్లీల వీడియోలు ఎక్కడ తీశారు? ఎక్కడ వాటి కాపీలు పెట్టారనే దానిపై ఆరాతీస్తున్నారు. ముంబైలోని కొన్ని హోటళ్లు ఫామ్ హౌసుల్లో అశ్లీల సినిమాల షూటింగ్ చేసి పెయిడ్ యాప్స్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. తాజాగా రాజ్ కుంద్రా మాజీ పీఏ ఉమేశ్ కామత్ నుంచి 70 అశ్లీల వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకుని ముంబైలోని వేర్వేరు ప్రొడక్షన్ హౌస్ ల సాయంతో వాటిని ఉమేశ్ షూట్ చేసినట్లు పోలీసులు విచారణ అనంతరం తెలిపారు.

ఈ వీడియోలు ఇప్పటికే రాజ్ కుంద్రా యూకేలోని తనకంపెనీ కిన్ రిస్ ద్వారా అశ్లీల యాప్స్ లో రిలీజ్ చేశాడా? లేదా అనేది తెలుసుకునేందుకు వాటిని ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ కు పంపనున్నారు. రాజ్ కుంద్రాను జూలై 23 వరకు పోలీస్ కస్టడీకి తీసుకున్న నేపథ్యంలో అతడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తూ ఈ కేసులో వారందరికీ నోటీసులు పంపి వారి నుంచి స్టేట్ మెంట్ తీసుకుంటామన్నారు.

పక్కా ఆధారాలు సేకరించి.. అతడితోపాటు ఈ కేసులో నిందితులందరికీ శిక్ష పడేలా చేస్తామని ముంబైపోలీసులు తెలిపారు. బ్యాంక్ అకౌంట్లను కూడా పరిశీలిస్తున్నట్టు పోలీస్ లు తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •