రాజకీయం (Politics) వార్తలు (News)

తెలంగాణ లో భారీవర్షాలతో కొట్టుకుపోయిన రహదారులు!!

తెలంగాణ రాష్ట్రాన్ని భారీవర్షాలు అతలాకుతలం చేసాయి. ఎక్కడ చూసినా రహదారులు కొట్టుకుపోయి జనసమ్మర్దం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలోనే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం నీరుకుళ్లలో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో రహదారి తెగిపోయింది. లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరుతుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరద ధాటికి పలు చోట్ల రహదారులు కొట్టుకుపోవడంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తిరిగి మరలా రహదారులు సాధారణస్థితికి చేరాలంటే ఎంత సమయం పడుతుందో వేచి చూడవలసిందే!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    14
    Shares
  • 14
  •  
  •  
  •  
  •