వార్తలు (News)

నీట మునిగిన సిరిసిల్ల కలెక్టరేట్ భవనం!!

అల్పపీడన ప్రభావంతో తెలంగాణ లో భారీ వర్షాలు కురవడంతో అనేక గ్రామాలు జలదిగ్భదంలో చిక్కుకుని చెరువులు, వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. శ్రీరామ్‌సాగర్ నుంచి మేడిగడ్డ వరకు నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టుల దిగువన ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని ఊళ్లలో చాటింపు వేశారు. వానల వల్ల సింగరేణి ఓపెన్ కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తి కూడా నిలిచిపోయింది.

అయితే సీఎం కేసీఆర్ ప్రారంభించిన సిరిసిల్ల కలెక్టరేట్ భవనం వరదల కారణంగా నీటమునిగింది. కలెక్టరేట్​ ప్రాంగణంలో మోకాళ్లలోతు నీళ్లు చేరాయి. ఇటీవలే కార్యాలయంలో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా కలెక్టరేట్ లోకి వెళ్లే మార్గం పూర్తిగా జలమయమై లోపలికి వెళ్లలేక, బయటికి రాలేక ఉద్యోగులు, జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్లాబ్​ల జాయింట్ల వద్ద వర్షపు నీరు లీకై గదుల్లోకి నీళ్లు చేరాయి. భారీగా చేరిన వర్షపు నీటితో కలెక్టర్ కార్యాలయం ముందున్న గార్డెన్‌లో మొక్కలు పాడయ్యాయి. వాహనాల పార్కింగ్‌కు ఉపయోగించే సెల్లూరులో కూడా వరద నీరు చేరింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •