క్రైమ్ (Crime) జాతీయం (National)

శ్రీనగర్ లో అతి పెద్ద తుపాకీ లైసెన్సుల స్కాం??

తుపాకీ లైసెన్సుల మంజూరులో గోల్‌మాల్‌ వ్యవహారంపై సీబీఐ దేశ రాజధాని దిల్లీ సహా జమ్మూకశ్మీర్‌లోని పలు చోట్ల ముమ్మర సోదాలు చేపట్టి అందులో భాగంగా శనివారం ఉదయం నుంచి శ్రీనగర్‌లోని సీనియర్‌ ఐఏఎస్‌ షాహిద్‌ ఇక్బాల్‌ చౌధురి ఇంటితో పాటు మొత్తం 40 చోట్ల సోదాలు సాగిస్తుంది.

జమ్మూకశ్మీర్‌ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన షాహిద్‌ ఇక్బాల్‌ చౌధురి ప్రస్తుతం గిరిజన వ్యవహారాల శాఖ కార్యదర్శిగా కొనసాగుతుండగా ఇంతకు ముందు యూత్‌ మిషన్‌ సీఈవోగానూ ఉన్నారు. గతంలో కతువా, రియాసి, రాజౌరి, ఉదంపూర్‌ జిల్లాల్లో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో ఇతర రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన వారికి నకిలీ పేర్లతో అక్రమంగా వేల సంఖ్యలో తుపాకీ లైసెన్సులను జారీచేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.

ఈ వ్యవహారంలో ఎనిమిది మంది డిప్యూటీ కమిషనర్లను సీబీఐ ప్రశ్నించగా 2012 వరకు దాదాపు రెండు లక్షలకు పైగా స్థానికేతరులకు అక్రమంగా తుపాకీ లైసెన్సులను జారీ చేసినట్టు నిర్ధారణ అయింది. దేశంలోనే అతిపెద్ద గన్‌ లైసెన్స్‌ రాకెట్‌ ఇదే. ఈ కుంభకోణంలోనే గతేడాది ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ రంజన్‌ సహా ఇద్దరు అధికారులను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. కుప్వారా జిల్లాకు డిప్యూటీ కమిషనర్లుగా ఉన్న సమయంలో రాజీవ్‌ రంజన్‌, ఇత్రాత్‌ హుస్సేన్‌ రఫికీలు అక్రమంగా గన్‌ లైసెన్సులు జారీ చేసిన ఆరోపణలపై అరెస్టయ్యారు.

తుపాకీ లైసెన్సుల మంజూరులో ఈ భారీ కుంభకోణాన్ని 2017లో రాజస్థాన్‌ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌ గుర్తించి రంజన్‌ సోదరుడితో పాటు గన్‌ డీలర్లకు మధ్యవర్తులుగా పనిచేస్తున్న పలువురు వ్యక్తులను అరెస్టు చేసిన సందర్భంలో ఈ విషయం వెలుగులోకి రాగా అప్పటి ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణ ముసుగులో నిందితులను రక్షించే ప్రయత్నం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే, ఈ కుంభకోణంలో కశ్మీర్‌ ప్రభుత్వ అధికారుల పాత్ర ఉన్నట్టు గుర్తించిన మాజీ గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోరా ఈ కేసును సీబీఐకి అప్పగించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •