అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) వార్తలు (News)

గతేడాది అమెరికాలో 3 వేల ఎకరాలు అగ్నికి ఆహుతి కావడానికి కారణం తెలిసింది..??

గతేడాది సెప్టెంబరులో ఎల్‌ రాంచ్‌ డొరాడో పార్కులో చెలరేగిన భారీ కార్చిచ్చుకి కారణం ఎట్టకేలకు తెలిసింది. ఈ ప్రమాదంలో సుమారు 23 వేల ఎకరాలు అగ్నికి ఆహుతి కాగా సెప్టెంబర్ 5, 2020 న శాన్ బెర్నార్డినో కౌంటీలో చెలరేగిన కార్చిచ్చు సుమారు 23 రోజుల పాటు కొనసాగింది. ఈ ప్రమాదంలో పలు ఇళ్లు ధ్వంసం కావడంతో పాటు ఓ అగ్నిమాపక అధికారి కూడా మరణించారు. అసలు ఈ కాచిచ్చుకి కారణం ఏంటంటే..అమెరికా ఎల్ రాంచ్ డొరాడో పార్కు సమీపంలో రెఫ్యూజియో మాన్యుయేల్ జిమెనెజ్ జూనియర్, ఎంజెలా రీనీ జిమినెజ్ జంట జెండర్‌ రివీల్‌ పార్టీ (పుట్టబోయే బిడ్డ ఆడా, మగా తెలిపే పార్టీ) ఏర్పాటు చేసింది.

అయితే ఈ పార్టీలో బ్లూ, పింక్ కలర్‌లో పొగలను రిలీజ్ చేసే పైరోటెక్నిక్ డివైజ్‌లను పేల్చగా బ్లూ కలర్ పొగ వస్తే మగ బిడ్డ అని, పింక్ కలర్ పొగ వస్తే ఆడపిల్ల అని అర్థం. ఈ క్రమంలో జిమెనెజ్‌ జంట వీడియో తీస్తూ డివైజ్ పేల్చడంతో పొగకు బదులుగా మంటలు వచ్చాయి. వాటర్ బాటిళ్లతో నీళ్లు పోసినా లాభం లేక మంటలు అదుపు తప్పి భారీగా విస్తరించాయి. ఈ ప్రమాదంలో సుమారు 23వేల ఎకరాలు అగ్నికి ఆహుతి కాగా ఈ జంటపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ”రెఫ్యూజియో మాన్యుయేల్ జిమెనెజ్ జూనియర్, ఎంజెలా రీనీ జిమినెజ్ జంట వల్లే ఇదంతా జరిగింది. ఈ దంపతుల మీద అసంకల్పిత మారణకాండతో సహా 30 నేరాలకు పాల్పడినట్లు” శాన్ బెర్నార్డినో కౌంటీ జిల్లా న్యాయవాది జాసన్ ఆండర్సన్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    29
    Shares
  • 29
  •  
  •  
  •  
  •