టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

నాగార్జునసాగర్ డ్యామ్ లో నీటికుక్కలు!!

భారీ వర్షాలతో నాగార్జునసాగర్ డ్యామ్ లో నీటిమట్టం పెరగుతుండటంతో అందులో జీవించే అరుదైన జంతుజాలం చూపరులను ఆకట్టుకుంటుంది. సాగర్ ఒడ్డున నీటికుక్కలు సందడి చేస్తున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సాగర్‌ జలాశయంలోకి ఎగువ నుంచి వరద ప్రవాహం మొదలైంది. దీంతో సాగర్ లో నీటిమట్టం అంతకంతకు పెరుగుతోంది. దీంతో జలాశయంలోంచి నీటికుక్కలు బయటకు వచ్చి సందర్శకులకు సందడి చేస్తున్నాయి.

చాలా అరుదుగా కనిపించే ఈ జంతువులు నీటిలో ఉండే చేపలను ఆహారంగా తీసుకొని నీళ్లలోనే జీవిస్తాయి. నీళ్ల లోపల ఈదుతూ జీవించడమే కాదు నీళ్ల బయట కూడా ఇవి జీవించగలవు. అంటే ఉభయ చర జీవులన్నమాట. నీటి కుక్కలు చాలా అరుదైన జాతి. ఇవి ప్రస్తుతం అంతరించిపోతున్న జీవుల జాబితాలో వున్నాయి. ఇప్పటికే నీటి కుక్కల జాతి చాలా వరకు కనుమరుగైందని కొన్ని మాత్రమే అక్కడక్కడ సంచరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •