అంతర్జాతీయం (International) వార్తలు (News)

తూర్పు అంటార్కిటికా ప్రాంతంలో విరిగి పడిన భారీ మంచు కొండ??

ప్రపంచంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు తూర్పు అంటార్కిటికా ప్రాంతంలో -94°C ఉష్ణోగ్రత నమోదవుతుంది. అంతే కాకుండా ఈ ప్రదేశంలో అప్పుడప్పుడు భారీ మంచుకొండలు విరిగి సముద్రంలో పడుతుంటాయి. ఈ సమయంలో ఆ ప్రాంతంలో సముద్ర మట్టం పెరుగుతుంటుంది.

ఇప్పుడు వెడెల్ సముద్రాన్ని అనుకోని ఉన్న మంచు కొండచరియ కూలి సముద్రంలో పడిపోయింది. ఇది ఢిల్లీ నగరమంతా పెద్దదిగా ఉంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో బ్రంట్ ఐస్ షెల్ఫ్ నుంచి 1270 చదరపు కిలోమీటర్ల పరిమాణంలో ఉన్న ఈ ఎ-74 విరిగిపడింది. ఎ-74 ఉన్న ప్రాంతంలో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో అది వేరుపడిన బ్రంట్ ఐస్ షెల్ఫ్ ను ఢీకొనే ప్రమాదం ఉందని హిమానీనద శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా జరిగితే 1700 చదరపు కిలోమీటర్ల సైజులో ఉండే మరో మంచు కొండ విడిపోతుందని భావిస్తున్నారు.

అదే కనక జరిగితే మంచుకొండలో మరిన్ని పగుళ్లు ఏర్పడి పర్యావరణానికి ముప్పుగా మారుతాయని, 150 మీటర్ల మందంతో ఉండే ఈ ఐస్ ముక్క సముద్రంలో పడితే సముద్ర మట్టం పెరుగుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •