జాతీయం (National) రాజకీయం (Politics) వార్తలు (News)

కేంద్రం షాకింగ్ నిర్ణయం.. రోడ్డు, విద్యుత్ రంగాలు ప్రైవేట్‌ పరం..!

కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జాతీయ మానిటైజేషన్ పైప్ లైన్ కార్యక్రమాన్ని ప్రకటించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, 6 కోట్ల లక్షల రూపాయల సమీకరణ లక్ష్యంగా జాతీయ మానిటైజేషన్ పైప్ లైన్ ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. రైల్వే, రోడ్డు, విద్యుత్ రంగాల్లో నిధుల సమీకరనే లక్ష్యంగా జాతీయ మానిటైజేషన్ పైప్ లైన్ పని చేస్తుందని, రైల్వే, రోడ్డు, విద్యుత్ రంగాల ఆస్తుల అమ్మకం తో ఏకంగా ఆరు లక్షల కోట్ల రూపాయలను సమీకరించవచ్చని, నిర్దిష్ట కాలానికి ఆస్తుల అమ్మకం ద్వారా నిధులను సమీకరించవచ్చని అభిప్రాయపడ్డారు. కానీ ఈ ఆస్తుల యజమాన్య హక్కులు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటాయని స్పష్టం చేశారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •