క్రైమ్ (Crime) జాతీయం (National) వార్తలు (News)

హాల్‌మార్క్‌ నిబంధనలు సడలించాలని బంగారు దుకాణాలు బంద్‌!!

హాల్‌మార్క్‌ యూనిక్‌ నంబరు వద్దంటూ దేశ వ్యాప్తంగా జరిగిన జ్యువెలరీ షాపుల బంద్‌లో భాగంగా సోమవారం హిందూపురంలో కూడా బంద్‌ నిర్వహించారు. ఉదయం నుంచే బంగారు షాపులు మూసివేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జ్యువెలరీషాపుల అసోసియేషన నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం హాల్‌మార్క్‌ నిబంధనలు సడలించాలని, జూన నుంచి హాల్‌మార్క్‌ ఉన్న ఆభరణాలు మాత్రమే విక్రయించాలని ప్రభుత్వం నిబంధనలు అమలులోకి తెచ్చిందని, హెచయుఐడీ విధానం ద్వారా వ్యాపారులకు తీవ్ర ఇబ్బందులు ఉంటాయని అన్నారు. వినతి పత్రాన్ని హిందూపురం తహసీల్దార్‌కు అందించారు. అనంతరం కార్యక్రమంలో జ్యువెలరీ హిందూపురం అసోషియేషన నాయకులు నంబూరీ శంకర్‌తోపాటు జ్యువెలరీ దుకాణాల నిర్వహకులు పాల్గొన్నట్టు సమాచారం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •