వార్తలు (News)

ఆధార్‌ కేంద్రాల వద్ద క్యూ లు కడుతున్న జనం??

ఏపీ ప్రభుత్వం అందించే పథకాలు ఉపయోగించుకోవాలంటే ఆధార్‌ లింక్‌ తప్పనిసరి చేసారు. ఈ నేపథ్యంలో జనం ఆధార్‌ కేంద్రాల వద్ద బారులు తీరి పడిగాపులు కాస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న 272 ఆధార్‌ కేంద్రాలలో రోజుకి పది మందికి మాత్రమే ఈ కేవైసీ అప్‌డేట్‌ చేయగలుగుతున్నారు. ఈ లెక్కలో ఈ ఒక్క జిల్లాలోనే కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడానికి మరొక మూడు నెలలు సమయం పడుతుంది. కానీ ఈ నెల చివరిలోపు పూర్తి చేయాలని వాలంటీర్లు చెబుతుంటే, ఆధార్‌ కేంద్రాల వద్ద తమ పిల్లలతో ఉదయం నుండి రాత్రి వరకు పడిగాపులు పడుతున్నారు. .

సెంటర్లు పెంచి ఈ అప్‌డేట్‌ లు చేయించుకునే వెసులు బాటు లేకపొతే కరోనా కేసులు పెరిగిపోయే అవకాశం ఉంది. ఇలా ప్రభుత్వం మారిన ప్రతిసారి తమకు ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సబబు అని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •