జాతీయం (National) వార్తలు (News)

రెండోరోజూ మార్కెట్ లో లాభాల జోరు!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజైన మంగళవారం కూడా లాభాలతో ముగిసాయి. ఉదయం సెన్సెక్స్‌ 55,647 పాయింట్ల వద్ద లాభాల్లోనే ఆరంభమైనా, క్రమంగా స్వల్ప నష్టాల్లోకి జారుకుని ఇంట్రాడేలో 55,536 పాయింట్ల వద్ద కనిష్ఠ స్థాయికి దిగివచ్చి చివరకు 403 పాయింట్ల లాభంతో 55,958 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 128 పాయింట్లు పెరిగి 16,624 వద్ద స్థిరపడింది.

టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫినాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ, సన్‌ఫార్మా, ఎల్‌అండ్‌టీ షేర్లు రాణించాయి. నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాలతో ముగిశాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    86
    Shares
  • 86
  •  
  •  
  •  
  •