అంతర్జాతీయం (International) జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

ఈ ఏడాది రికార్డు స్థాయిలో అమెరికా వీసాలు!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉదృతి కొనసాగుతున్న సమయంలో కూడా అమెరికా వెళ్లే భారత విద్యార్థులకు రికార్డు స్థాయిలో వీసాలు మంజూరు చేసినట్లు అమెరికా అధికారులు చెప్పారు. ఈ ఏడాది (2021) ఇప్పటివరకే దాదాపు 55వేలకు పైగా విద్యార్థులకు వీసా మంజూరు చేశామని, అంతేకాకుండా ప్రతిరోజు అనుమతి పొందుతున్న వీసాల్లో విద్యార్థులవే ఎక్కువగా ఉంటున్నాయని దిల్లీలోని అమెరికా ఎంబసీ నివేదికలు చెప్తున్నాయి.

‘అమెరికాలో ఉన్నత చదువు అనేది భారత విద్యార్థులకు ఓ ప్రత్యేకమైన అనుభవం. ప్రపంచ దృక్పథాన్ని అలవరచుకోవడంతో పాటు అమూల్యమైన ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. అంతేకాకుండా ఇరుదేశాల మధ్య సంబంధాలను ఇవి మరింత బలోపేతం చేస్తాయి’ అని, కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్ విజృంభణ కారణంగా వీసా ఇంటర్వ్యూ ప్రక్రియ రెండు నెలలు వాయిదా పడిందని, విద్యార్థులకు సెమిస్టర్‌ నష్టం కలుగకుండా ఉండేందుకు వీలైనంత వేగంగా వీసా మంజూరు ప్రక్రియను కొనసాగించామని, కరోనా వైరస్‌ సమయంలోను భారతీయ విద్యార్థులకు మునుపెన్నడూ లేని విధంగా వీసాలు మంజూరు చేశామని దిల్లీలోని అమెరికా దౌత్యవేత్త అతుల్‌ కేశప్‌ వెల్లడించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •