క్రైమ్ (Crime) వార్తలు (News)

సూపర్​ డాగ్:​ 20 నిమిషాల్లోనే ఆరుగురు రేపిస్టుల భరతం పట్టింది..!!

దేశంలో కోర్టుల్లో లక్షలాది కేసులు పెండింగులో ఉన్నాయి. మరోవైపు విచారణలో లెక్కకు మించిన కేసులు ఉన్నాయి. దీంతో పోలీసులు కేసులు సత్వరం పరిష్కరించడానికి టెక్నాలజీ సాయం తీసుకుంటారు.

అంతేకాక క్రిమినల్ కేసుల విచారణకు పోలీసులు డాగ్ స్క్వాడ్స్ ఉపయోగిస్తుంటారు. శిక్షణ పొందిన శునకాలు వాసన ఆధారంగానే హంతకుల ను పసిగడుతాయి. నేర పరిశోధనలో ప్రముఖ పాత్ర పోషిస్తుంటాయి. ఇదే క్రమంలో గుజరాత్​లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వడోదర పోలీస్ డాగ్ స్క్వాడ్​లోని శునకం కేవలం 20 నిమిషాల్లోనే ఆరుగురు రేపిస్టులను పోలీసులకు పట్టించింది.

ఆగస్టు 16న కర్ణన్ తాలూకా పరిధిలోని దేహాన్ గ్రామ సమీపంలో గడ్డికోస్తున్న మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. ఈ ఘటనలో కర్ణాన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. స్నిఫర్ డాగ్ జావాతో క్రైమ్​ స్పాట్​కు చేరుకున్న పోలీసులు డాగ్​ సాయంతో ముందుగా నిందితుల్లో ఒకరైన యూపీకి చెందిన 22 ఏళ్ల లాల్ బహదూర్ గిర్దారాంను అరెస్టు చేశారు. ఆ తర్వాత మిగతా వారిని పట్టుకున్నారు.

అత్యాచారానికి పాల్పడ్డ దుండగులు ఆ తర్వాత ఆమెను హత్య చేశారు. ఈ కేసును పోలీసులు చాలెంజ్ గా తీసుకుని దీనికోసం విచారణలో స్నిఫర్ డాగ్ ‘జావా’ సాయం తీసుకున్నారు. ఈ మేరకు ఒక బాటిల్​తో పాటు దుపట్టాను పసిగట్టిన మన సూపర్​ డాగ్​ నిందితులు పారిపోయిన దిశగా పోలీసులను నడిపించింది. అహ్మదాబాద్-ముంబై రైల్వే ట్రాక్ దాటి దాదాపు రెండు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి, అక్కడున్న ఓ టెంట్ దగ్గర ఆగిపోయి మొరగడం ప్రారంభించింది. దీంతో పోలీసులు రేపిస్టుల(rapists)ను పట్టుకోగలిగారు. 45 రోజుల వ్యవధిలో పలు హత్య కేసుల్లో నిందితులను గుర్తించేందుకు సూపర్​ డాగ్​ పోలీసులకు సాయపడటం ఇది మూడోసారి అని తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •