క్రైమ్ (Crime) వార్తలు (News)

22 రోజులుగా కొడుకు మృతదేహాన్ని ఫ్రిడ్జ్ లో భద్రపరచిన తండ్రి??

ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పుర్‌ జిల్లా మజావున్‌ గ్రామానికి చెందిన శివాంక్‌(32) 2012 నుంచి దిల్లీలోని ఓ కాల్‌సెంటర్‌లో పనిచేస్తున్న సమయంలో అక్కడ అతడికి గుర్లీన్‌ కౌర్‌ అనే యువతి పరిచయం కావడంతో 2013లో వారు వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 1వ తేదీన శివాంగ్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని అతడి తండ్రి శివ్‌ప్రతాప్‌ పాఠక్‌కు అప్పగించగా కుమారుడి శవాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చిన పాఠక్‌ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా కొడుకు మృతిపై అనుమానాలున్నాయని, ఆస్తి కోసం కోడలే హత్య చేసి ఉంటుందని, నిజాలు బయటపడేవరకు దహన సంస్కారాలు నిర్వహించబోనని శవాన్ని ఇంట్లోని డీప్‌ ఫ్రిజ్‌లో భద్రపరిచాడు.

విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ సోమవారం పోలీసు యంత్రాంగంతో చర్చలు జరిపిన అనంతరం శివాంక్‌ మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయించారు. జిల్లా ప్రధాన మెడికల్ ఆఫీసర్ (సీఎంఓ) పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన డాక్టర్ల బృందం మంగళవారం ఆ శవానికి రెండోసారి పోస్టుమార్టం నిర్వహించగా ఇంకా నివేదిక రావాల్సి ఉంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    203
    Shares
  • 203
  •  
  •  
  •  
  •