అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) వార్తలు (News)

దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన 40 మంది అఫ్గాన్‌ ఉగ్రవాదులు !!

రాబోయే పండుగ రోజుల్లో దేశంలో భారీ దాడులకు తెగబడేందుకు ఉగ్ర సంస్థలు కుట్ర పన్నుతున్నాయని, 40 మంది అఫ్గాన్‌ ఉగ్రవాదులు మనదేశంలోకి జొరబడేందుకు పన్నాగాలు రచిస్తున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. పాక్‌ మద్దతుతో దేశంలోకి చొరబడేందుకు వారంతా సిద్ధంగా ఉన్నట్టు, పాక్‌లోని ఐఎస్‌ఐ అండతో సరిహద్దులు దాటేందుకు అఫ్గాన్‌ మూకలు ప్రయత్నిస్తున్నాయని, వీరికి ఐఎస్‌ఐ టిఫిన్‌బాంబుల తయారీలో పాక్‌ శిక్షణ ఇచ్చిందని అప్రమత్తంచేసింది. పారామిలటరీ, రాష్ట్ర పోలీసులను నిఘా సంస్థలు అప్రమత్తం చేశాయి. ముష్కరుల కదలికలపై పక్కా సమాచారం ఉందని తెలిపాయి.

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా ఉరీ సెక్టార్‌ వద్ద నియంత్రణ రేఖ సమీపంలో పాక్‌ నుంచి ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలను సైన్యం భగ్నం చేసింది. ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చి వారి నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. నియంత్రణ రేఖ వద్ద హత్లాంగ ప్రాంతంలో అనుమానిత వ్యక్తుల కదలికలను గుర్తించి ముష్కరులను హతమార్చినట్టు, వారి నుంచి ఐదు రైఫిళ్లు, ఏడు పిస్తోళ్లు, గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •