వార్తలు (News)

ఒకే స్కూల్లో 82 మందికి కరోనా?

కరోనా వైరస్ వచ్చిన నాడు మూతపడిన విద్యాసంస్థలు నేటికీ అన్ని రాష్ట్రాలలో పూర్తిస్థాయిలో తెరుచుకోలేదు. మొదటి దశ కరోనా వైరస్ ముగియగానే విద్యాసంస్థలను తెరవాలని ప్రయత్నించినప్పటికీ ఊహించనంత వేగంతో రెండవ దశ దూసుకువచ్చి అందరూ వెనుకడుగు వేశారు. మూడవ దశ కరోనా వైరస్ వస్తుందని చెబుతున్నప్పటికీ ఎక్కువగా ప్రభావం చూపదు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాలలో కూడా విద్యాసంస్థలు ప్రారంభమవుతున్నాయి. దీంతో ఎన్నో రోజుల నుంచి ఇంటికే పరిమితమైన విద్యార్థులు కరోనా నిబంధనలను పాటిస్తూనే ఇప్పుడు పాఠశాలలకు వెళుతున్నారు.

ఇలా పకడ్బందీగా తరగతులు నిర్వహిస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం కరోనా వైరస్ వ్యాపిస్తుంది. హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ధరంపూర్ పాఠశాలలో కరోనా కలకలం రేపింది. ఇటీవలే పాఠశాలలో కరోనా పరీక్షలు నిర్వహించగా ముగ్గురు ఉపాధ్యాయులు సహా ఏకంగా 79 మంది విద్యార్థులకు పాజిటివ్ రావడం సంచలనం గా మారిపోయింది. దీంతో పాజిటివ్ వచ్చిన వీళ్లందరినీ కూడా క్వారంటైన్ కి తరలించి ఆ పాఠశాలను కంటైన్మెంట్ జోన్ గా అధికారులు ప్రకటించారు. ఈనెల 25 వరకు రాష్ట్రంలో పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో విద్యార్థుల చదువులు మరోసారి అయోమయంలో పడిపోయాయ్.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •