క్రైమ్ (Crime) వార్తలు (News)

నీట్ పరీక్షల్లో అక్రమాలు??

వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు విద్యార్థుల స్థానంలో నకిలీ వ్యక్తులతో పరీక్ష రాయిస్తామంటూ మహారాష్ట్రకు చెందిన ఒక కోచింగ్‌ సెంటర్‌ కొందరితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఒక్కో విద్యార్థి నుంచి రూ.50లక్షలు డిమాండ్‌ చేసినట్లు దర్యాప్తులో వెలుగుచూసింది.

నాగ్‌పూర్‌కు చెందిన ఓ కోచింగ్‌ సెంటర్‌ ఈ కుంభకోణానికి యత్నించినట్లు సీబీఐ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో అడ్మిషన్లు ఇప్పిస్తామంటూ నీట్ అభ్యర్థులతో ఒప్పందం కుదుర్చుకుంది. రూ.50లక్షలిస్తే అభ్యర్థుల స్థానంలో నకిలీ వ్యక్తులతో పరీక్ష రాయిస్తామని చెప్పినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి.

ఇందుకోసం అభ్యర్థుల నుంచి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లు తీసుకుని అందులో విద్యార్థుల ఫొటోలు మార్ఫింగ్‌ చేసినట్లు తెలిసింది. అభ్యర్థుల ఈ-ఆధార్‌ కార్డులను తీసుకుని వాటితో నకిలీ ఐడీకార్డులు తయారుచేసినట్లు, ఇలా కుదరకపోతే అభ్యర్థులకు ఆన్సర్‌ ‘కీ’ పేపర్లు ఇవ్వడం, లేదా ఓఎంఆర్‌ షీట్‌ను మారుస్తామంటూ సదరు కోచింగ్‌ సెంటర్‌ విద్యార్థులతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ నెల 12వ తేదీన జరిగిన నీట్ పరీక్షలో మొత్తం ఐదు సెంటర్లలో ఈ స్కామ్ చేసేందుకు కోచింగ్‌ సెంటర్‌ ప్రయత్నించగా ఈ కుంభకోణం గురించి సీబీఐకి ముందుగానే సమాచారం రావడంతో వారిని పట్టుకునేందుకు అధికారులు పరీక్షా కేంద్రాల్లో కాపుకాశారు. దీంతో కోచింగ్‌ సెంటర్‌ ప్రయత్నాలు ఫలించలేదు. అనంతరం కోచింగ్ సెంటర్‌ డైరెక్టర్‌, కొంతమంది విద్యార్థులపై సీబీఐ కేసు నమోదు చేసినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •