ఎన్నికలు (Elections) రాజకీయం (Politics) వార్తలు (News)

తాళ్లరేవు ఎంపిపిగా నియమితులైన రాయుడు సునీత!!

తాళ్లరేవు ఎంపిపిగా రాయుడు సునీత పేరును ఎంఎల్‌ఎ పొన్నాడ వెంకట సతీష్‌కుమర్‌ ప్రకటించారు. నూతనంగా ఎన్నికైన జెడ్‌పిటిసి, ఎంపిటిసిలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్లు , పార్టీ నిర్దేశించిన సమీకరణాల ఆధారంగా కొందరికి అవకాశాలు కల్పిస్తారని, పార్టీ పదవులు రానివారు నిరుత్సాహపడవద్దని హితవు పలికారు. జెడ్‌పిటిసిగా అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన దొమ్మేటి సామ్యూల్‌ సాగర్‌కు రాబోయే రోజుల్లో మెజార్టీ రెట్టింపుకావాలని, వైస్‌ ఎంపిపిలుగా కాపు, మత్స్యకార సామాజిక తరగతులకు చెందిన వారికి అవకాశమివ్వనున్నట్లు, ప్రతి ఒక్కరూ పార్టీకి విధేయులుగా పని చేయాలని తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •