దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 11లక్షల మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 6,650 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 374 మరణాలు సంభవించడంతో ఇప్పటివరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 4.79లక్షలకు చేరింది.
గత 24 గంటల్లో 7,051 మంది కొవిడ్ నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 3.42 కోట్లకు చేరింది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసులు సంఖ్య 77,516గా ఉంది.

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు 24 గంటల క్రితం 236గా ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 358కి చేరింది. అంటే 24 గంటల వ్యవధిలో 100 మందికి పైగా ఈ వేరియంట్ బారినపడ్డారు.

ఓమిక్రాన్ కేసుల సంఖ్య..