రైల్వే ప్రయాణికుల కోసం కేంద్రం టూత్ పేస్ట్, మాస్క్, డిస్పోజబుల్ బెడ్ షీట్లను అందించనుంది. కాకపోతే ఈ సదుపాయం అన్ని రైళ్లలోనూ కాకుండా రైల్వే శాఖ ఎంపిక చేసిన ట్రైన్లలో మాత్రమే ఉండనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు.
ఇందులో భాగంగా రైలులో మూడు రకాల డిస్పోజబుల్ బెడ్‌రోల్ కిట్లు అందుబాటులో ఉంటాయి. ఒక కిట్‌లో నాన్ ఓవెన్ పిల్లో (నేసిన దిండు) దాని కవర్,డిస్పోజబుల్ బ్యాగ్, టూత్‌పేస్ట్, టూత్ బ్రష్, హెయిర్ ఆయిల్, దువ్వెన, శానిటైజర్ , పెప్పర్ సోప్, టిష్యూ పేపర్లు ఉంటాయి. ఈ కిట్ ధర రూ. 300గా ఉంది. ఒక ప్రయాణికుడు ఒక దుప్పటిని మాత్రమే కొనుగోలు చేయాలనుకుంటే రూ. 150 చెల్లించాల్సి ఉంటుంది. కాగా కేంద్ర రైల్వే శాఖ నిర్ణయించిన రైళ్లలో సంబంధిత శాఖకు చెందిన కార్మికులు రైళ్లలో అమ్ముతారని రైల్వే అధికారులు ప్రకటించారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ట్రైన్లు ఈ డిస్పోజబుల్ బెడ్ షీట్లు సుదూర ప్రాంతాలకు జర్నీ చేసే ప్రయాణికుల కోసం అందుబాటులోకి తెచ్చినట్లు కేంద్ర రైల్వే శాఖ తెలిపింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ముంబై – ఢిల్లీలో రాజదాని ఎక్స్ ప్రెస్, ముంబై – ఢిల్లీ ఆగస్ట్ క్రాంతి రాజధాని ఎక్స్ ప్రెస్, గోల్డెన్ టెంపుల్ మెయిల్, పశ్చిమ్ ఎక్స్‌ప్రెస్ లలో అందుబాటులో ఉంది. బెడ్ షీట్ల సౌకర్యం కల్పించినందుకు గాను కేంద్రం ప్రయాణికుల నుంచి అదనంగా రూ.150వసూలు చేయనుంది. అయితే డిస్పోజబుల్ బెడ్ షీట్ కిట్ల ధరలు జోన్లను బట్టి మారవచ్చు. కొన్ని ప్రాంతాల్లో కిట్‌లో టూత్‌పేస్ట్, శానిటైజర్లు ఇస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో దుప్పట్లు, దిండ్లు, షీట్లు మాత్రమే అందిస్తున్నారు. ఇవి ప్రాంతాన్ని బట్టి మారుతాయి.