జూబ్లీహిల్స్‌ ప్రాంతంలోని పబ్బులు, బార్ల నుంచి శబ్ధకాలుష్యం వస్తోందంటూ హైకోర్టు లో పిటిషన్‌ దాఖలు అవ్వడంతో దానిపై స్పందించిన హైకోర్టు ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ, నగర పోలీసు కమిషనర్‌తోపాటు ప్రతివాదులుగా ఉన్న పబ్బులు, బార్ల యజమానులకు ఆదేశాలు జారీ చేసింది.

న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేశారు. తమ నివాస ప్రాంతాలకు సమీపంలో ఏర్పాటు చేసిన పబ్బులు, బార్లతో తీవ్రమైన శబ్ధకాలుష్యం ఏర్పడుతోందని జూబ్లీహిల్స్‌ రెసిడెంట్స్‌ అసోసియేషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.