బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో సెక్షన్ ఇంజనీర్స్ తో పాటు పలు ఇతర ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా అప్లై చేసుకోవడానికి జనవరి 17ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులు మూడేళ్ల పాటు కాంట్రాక్ట్ విధానంలో పని చేయాల్సి ఉంటుంది.

పోస్టుఖాళీలు
చీఫ్ ఇంజనీర్1
అడిషనల్ చీఫ్ ఇంజనీర్/డిప్యూటీ చీఫ్ ఇంజనీర్2
డిప్యూటీ జనరల్ మేనేజర్(Arch)1
ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ డిజైన్2
మేనేజర్(Arch)1
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిజైన్2
అసిస్టెంట్. ఇంజనీర్-డిజైన్3
సెక్షన్ ఇంజనీర్5
మొత్తం17

డిప్యూటీ జీఎం: Arch లేదా ప్లానింగ్ లో డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
ఎగ్జిగ్యూటివ్ ఇంజనీర్ డిజైన్: సివిల్ ఇంజనీరింగ్ లో బీఈ/బీటెక్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

డిప్యూటీ మేనేజర్ (Arch): బీ.ఆర్క్ లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

సెక్షన్ ఇంజనీర్(డిజైన్): సివిల్ ఇంజనీరింగ్ లో బీఈ/బీటెక్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

మేనేజర్(Arch): బీ.ఆర్క్ లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

సెక్షన్ ఇంజనీర్(Arch): ఆర్కిటెక్చర్ లో డిగ్రీ/డిప్లొమా చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

చీఫ్ ఇంజనీర్: సివిల్ ఇంజనీరింగ్ లో బీఈ/బీటెక్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లో పీజీ చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.
అడిషనల్ చీఫ్ ఇంజనీర్/డిప్యూటీ చీఫ్ ఇంజనీర్: సివిల్ ఇంజనీరింగ్ లో బీఈ/బీటెక్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిజైన్: సివిల్ ఇంజనీరింగ్ లో బీటెక్ లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

వేతనాల వివరాలు: ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ. 40 వేల నుంచి రూ. 1.65 లక్షల వరకు వేతనం ఉంటుందని నోటిఫికేషన్లో తెలిపారు. వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరుగా వేతనం ఉంటుంది.

అప్లై చేసే విధానం : అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మొదటగా ఈ లింక్ ద్వారా అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయాలి. అనంతరం హోం పేజీలో Career ఆప్షన్ పై క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ నోటిఫికేషన్ వివరాల పక్కన Click here to Apply Online అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. తర్వాత కావాల్సిన వివరాలను నమోదు చేసి అప్లికేషన్ ఫామ్ ను నింపాలి. తర్వాత ఆఫామ్ ను ప్రింట్ తీసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ కు కావాల్సిన ధ్రువపత్రాలను జత చేసి General Manager (HR), Bangalore Metro Rail Corporation Limited, III Floor, BMTC Complex, K.H. Road, Shanthinagar, Bengaluru 560027 చిరునామాకు గడువులోగా చేరేలా పంపించాలి.