నేటి దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు ఫ్లాట్‌గా ట్రేడింగ్ ను మొదలుపెట్టాయి. ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్‌ 73 పాయింట్ల లాభంతో 57,389 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 17 పాయింట్లు లాభపడి 17,090 వద్ద ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో ఏషియన్ పెయింట్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, విప్రో, ఇన్ఫోసిస్‌ అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, , భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. సన్‌ఫార్మా, ఎస్‌బీఐ, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, రిలయన్స్, ఎన్‌టీపీసీ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.