పోలీస్​ శాఖలో పని చేస్తున్న హోం గార్డులకు 30 శాతం పీఆర్సీని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఈ ఏడాది జూన్​లోనే ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్​, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీని ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ రెగ్యూలర్​ ఉద్యోగులకు మాత్రమే 30 శాతంతో పెరిగిన వేతనాలు చెల్లిస్తూ మిగిలిన వారికి వేతనాల పెంపును అమలు చేయడం లేదు.

ఒక్కో శాఖ వారికి వేతనాలు పెంచుతూ ఇటీవల కాలంలో నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ నెల మొదటివారంలో అంగన్​వాడీలకు వేతనాలు పెంచిన ప్రభుత్వం, ఇప్పుడు హోంగార్డుల వేతనాలను 30 శాతం పెంచుతున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వీరికి జూన్​ నుంచే వేతన పెంపును వర్తింపచేస్తున్నట్లు పేర్కొంది. జూన్​ నుంచి పెంచిన వేతనాలను త్వరలోనే ఏరియర్స్​ రూపంలో ఇవ్వనున్నట్లు సమాచారం.