దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో వరుసగా నమోదవుతున్న లాభాలు నేడు నష్టాల లోకి జారుకున్నాయి. ఉదయం సెన్సెక్స్‌ 57,567.11 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమై కొద్దిసేపటికి నష్టాల్లోకి జారుకొని ఇంట్రాడేలో 56,813.42 వద్ద కనిష్ఠాన్ని తాకి చివరకు 190.97 పాయింట్ల నష్టంతో 57,124.31 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 17,149.50 పాయింట్ల వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 16,909.60 వద్ద కనిష్ఠాన్ని తాకి చివరకు 68.85 పాయింట్లు నష్టపోయి 17,003.75 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్ 30 సూచీల్లో హెచ్ సిఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఆసియన్ పెయింట్స్, విప్రో, ఇన్ఫోసిస్, రిలయన్స్ షేర్లు లాభాల్లో ముగియగా, పవర్ గ్రిడ్, ఎన్ టిపిసి, ఆక్సిస్ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు, ఎం అండ్ ఎం, డాక్టర్ రెడ్డీస్ షేర్లు నష్టాల్లో ముగిసాయి.