ప్రముఖ ఈ-కామర్స్​ సంస్థ అమెజాన్ ఇటీవల ఫెస్టివల్​ సేల్స్​తో పాటు ప్రత్యేక సేల్స్​ను కూడా నిర్వహిస్తూ ‘వింటర్ షాపింగ్ స్టోర్ సేల్’​ను ప్రకటించింది. ఈ సీజన్‌లో ఎక్కువగా ఉపయోగించే గీజర్లు, రూమ్ హీటర్లు, ఎలక్ట్రిక్ కెటిల్స్ వంటి పరికరాలపై 60 శాతం వరకు డిస్కౌంట్​ అందిస్తోంది. ఇప్పటికే ప్రారంభమైన ఈ సేల్​ జనవరి 11 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో బ్లాంకెట్లు, క్విల్ట్స్, రిక్లైనర్లు, కంఫర్టర్లు, బెడ్లు, వంట సామాను, డిన్నర్‌ వేర్‌లను డిస్కౌంట్​పై కొనుగోలు చేయవచ్చు.

ఇంకా ఎఫ్​పీఎల్​ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ జారీ చేసిన అమెజాన్ వన్​కార్డ్ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్లపై 10 శాతం ఇన్​స్టంట్ డిస్కౌంట్​ను కూడా పొందవచ్చు. ఈ సేల్​లో వాటర్ హీటర్లు, స్మార్ట్ ప్లగ్‌లతో పాటు క్యాస్రోల్, ఫ్లాస్క్‌లపై కూడా ఆఫర్లు ప్రకటించింది.

అమెజాన్​ వింటర్ షాపింగ్ స్టోర్ సేల్​లో బజాజ్, క్రాంప్టన్‌తో సహా వివిధ బ్రాండ్లకు చెందిన వాటర్ హీటర్లపై ఆకట్టుకునే డీల్స్​ అందిస్తుంది. బజాజ్​ న్యూ శక్తి 15 లీటర్​ వాటర్​ హీటర్​ అసలు ధర రూ. 10,450 ఉండగా కేవలం దీన్ని రూ. 5,899 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇక, క్రాంప్టన్ అమెకా 15L వాటర్ హీటర్ అసలు ధర రూ. 11,500 వద్ద ఉండగా దీన్ని కేవలం రూ. 6,599 వద్ద కొనుగోలు చేయవచ్చు.

వింటర్​ షాపింగ్​ స్టోర్​ సేల్​లో రూమ్ హీటర్లపై కూడా ఆఫర్లు ప్రకటించింది. మార్ఫీ రిచర్డ్స్ ఓఎఫ్​ఆర్​ 09 2000 -వాట్ ఆయిల్ ఫిల్డ్ రేడియేటర్ అసలు ధర రూ. 7,330 వద్ద ఉండగా.. దీన్ని కేవలం రూ. 4,469 వద్ద కొనుగోలు చేయవచ్చు. జనవరి 11న ముగియనున్న ఈ సేల్​లో బజాజ్, ఓర్పాట్, హావెల్స్​కు చెందిన వాటర్​ హీటర్లు, అమెజాన్ స్మార్ట్ ప్లగ్స్ వంటి పరికరాలపై అందిస్తున్న డిస్కౌంట్​ వినియోగదారులకు ఎంతో ప్రయోజనకరం.