భారత్‌లో కరోనా వైరస్‌ విజృభిస్తుంది. గడిచిన 24 గంటల్లో 138 మంది కరోనా కారణంగా మరణించడం ఆందోళనకరంగా మారింది. క్రితం రోజుతో పోలిస్తే కేసుల్లో భారీ పెరుగుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో 7.93లక్షల మందిని పరీక్షించగా 16,738 మందికి వైరస్‌ సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,46,914 కి చేరింది. కొత్తగా 11,799మంది కోలుకుంటుండగా మొత్తం రికవరీల సంఖ్య 1,07,38,501కు చేరి రికవరీ రేటు 97.25శాతంగా కొనసాగుతున్నది.

గడిచిన 24 గంటల్లో 138 మంది ప్రాణాలు కోల్పోడంతో ఈ కరోనా వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,56,705కి చేరుకుంది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 1,51,708కు చేరగా మరణాల రేటు 1.42 శాతంగా కొనసాగుతోంది. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ సజావుగా సాగుతోంది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 5.03లక్షల మందికి టీకా ఇచ్చారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం టీకా తీసుకొన్న వారి సంఖ్య 1,26,71,163కి చేరింది.