ఓటీటీ, డిజిటల్​ మీడియా వంటి సోషల్ మీడియాకు కేంద్రం కొన్ని మార్గదర్శకాలు నిర్దేశించింది. చట్టవిరుద్ధమైన, తప్పుడు సమాచారాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా ఈ కఠిన చర్యలు చేపట్టింది.

ఆ మార్గదర్శకాల్లో భాగంగా సోషల్​ మీడియాపై ఫిర్యాదులను కేవలం 15 రోజుల్లోనే పరిష్కరించాలని స్పష్టం చేసింది. చీఫ్​ కంప్లయిన్స్​ ఆఫీసర్​, రెసిడెంట్​ గ్రీవెన్స్​ అధికారి, నోడల్​ అధికారిని ఏర్పాటు చేయాల్సిందిగా అడిగింది. 

“భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ఓటీటీలు, డిజిటల్ మీడియా స్వీయ నియంత్రణ పాటించేలా చూసేందుకే ఈ మార్గదర్శకాలు తెచ్చామని అవి ఖశ్చితంగా పాటించవలసిందేనని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్​ జావడేకర్​ వెల్లడించారు.

ఓటీటీల కోసం మూడంచెల విధానం తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. ఓటీటీ, డిజిటల్​ మీడియాకు రిజిస్ట్రేషన్​ తప్పనిసరి కాదని, తమ వివరాలను మాత్రం వెల్లడించాలని పేర్కొన్నారు. 

సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, తప్పుడు సమాచారం వ్యాప్తిపై అనేక ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అందుకే కేంద్రం ఈ మార్గదర్శకాలను తీసుకొచ్చింది.

కొత్త నిబంధనలను అనుసరించి సామాజిక మాధ్యమ సంస్థలు గ్రీవెన్స్ అధికారిని నియమించుకోవాలి. ఏమైనా ఫిర్యాదులు వస్తే 24 గంటల్లోగా నమోదు చేయాలి. మహిళల నగ్న, మార్ఫింగ్ చిత్రాలు ఉన్న కంటెంట్​ను 24 గంటల్లోగా తొలగించాలని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వివరించారు.

గ్రీవెన్స్​ అధికారి తప్పనిసరిగా భారత నివాసి మాత్రమే అవ్వాలని స్పష్టం చేశారు. అన్ని రకాల సామాజిక మాధ్యమాలని భారత దేశం లో స్వాగతిస్తాము కానీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తే ఉపేక్షించేది లేదని రవిశంకర్​ ప్రసాద్​ స్పష్టం చేశారు.