జేఈఈ మెయిన్ పేపర్-1 తొలిరోజు రెండు పరీక్షలు సులభం నుండి మధ్యస్థంగా ఉన్నాయని విద్యార్థులు, నిపుణుల అభిప్రాయం. ఎన్ఐటీ ల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి మూడు రోజులు నిర్వహించనుంది. జేఈఈ మెయిన్ పేపర్-1 ఆన్లైన్ పరీక్షలు దేశవ్యాప్తంగా బుధవారం ప్రారంభమయ్యాయని తెలిపారు. మూడు రోజుల్లో ఆరు విడతల్లో జరగనున్న ఈ పరీక్షలకు 6 .61 లక్షల మంది అవ్వనున్నారని తెలిపారు.తొలిరోజు దాదాపు రెండు లక్షల మంది వరకు హాజరయ్యారని అంచనా! ఈరోజు హాజరు శాతాన్ని ఇంకా ప్రకటించలేదు.ఏపీలో 20 , తెలంగాణలోని 10 నగరాలు,పట్టణాల్లో విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

ఈసారి ఇంటిజర్ ప్రశ్నల్లో ఛాయస్ ఉన్న కారణంగా 300 మార్కులకు 300 మార్కులు కూడా వచ్చే అవకాశం ఉందని అంచనా. రసాయన, భౌతిక శాస్త్రం ప్రశ్నలతో పోలిస్తే గణితం ప్రశ్నలకు మాత్రం అనుకున్నదానికంటే ఎక్కువ సమయం తీసుకుందని చెబుతున్నారు.మొత్తం మీద మొదటి విడత సులభంగా రెండవ విడత ప్రశ్నాపత్రం మధ్యస్తంగా ఉందని చెప్పారు.గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది సులభంగా ఉందని ఎక్కువమంది నోటా వచ్చిన మాట!
ఎన్ సి ఈ ఆర్ టీ సిలబస్ నుండి ఎక్కువ ప్రశంలు వచ్చాయని తెలుపుతున్నారు.ఒక విద్యార్థి అయితే సగమే రాయగలిగానని ఆన్లైన్ లో శిక్షణ తీసుకోవడం వల్ల ఆశించిన విధంగా రాయలేకపోయానని వాపోయారు. ప్రత్యక్షంగా బోధించే విధానం ఉంది ఉంటె ఇంకా సులువుగా రాసె అవకాశం ఉండేదని బాధపడుతున్నారు.గతం తో పోలిస్తే చాల భిన్నంగా ప్రశ్నలు వచ్చాయని విజయవాడకు చెందిన ఒక విద్యార్ధి అన్నారు.