గత కొన్ని దినాలుగా విజయవాడ దుర్గ గుడిపై ఏసిబి దాడుల సంగతి పాఠకులకు తెలిసినదే! అయితే తాజాగా స్వయానా మంత్రి అనుచరుడిపైన వేటు పడింది. దుర్గగుడిలో జరిగే అక్రమాలపై ప్రభుత్వానికి ఏసిబి నివేదిక సమర్పించింది.ఆ నివేదిక ఆధారంగా 15 మంది ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.ప్రాథమిక నివేదిక ఆధారంగా గత్యంతరం లేని పరిస్థితులలో ఈ చర్యలకు పాల్పడింది.గత కొంతకాలంగా జరుగుతున్న అక్రమాలకు సంబంధించి అభియోగాలు మోపుతూ మరొక నివేదికను ఏసిబి అధికారులు ప్రభుత్వానికి పంపినట్టు తెలుస్తుంది.దానివల్లే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు భాగంగానే మంత్రి వెల్లంపల్లి అనుచరుడి ఈవో సురేష్బాబు మంత్రి వెల్లంపల్లికి అనుచరుడు.వెల్లంపల్లి హయాంలోనే దుర్గ గుడిలో అన్ని అక్రమాలు జరిగాయని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.