ప్రపంచంలోనే అత్యాధునిక వసతులతో, అతి పెద్ద క్రికెట్ మైదానం గా అభివృద్ధి చేసిన నరేంద్ర మోడీ స్టేడియంలో బుధవారం టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ప్రారంభమైన తొలి రోజే అంతర్జాతీయ క్రికెట్లో సరికొత్త రికార్డు నమోదు అయింది.భారత్ * ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్నా పింక్ బాల్ టెస్టులో మొదటి రోజు మొత్తం 13 వికెట్స్ పడగా, ఇది నాలుగవసారి కాగా, తక్కువ మొత్తం స్కోర్ నమోదు కావడం ఇదే తొలిసారి. దీనితో అహ్మదాబాద్ మైదానం ప్రారంభమైన మొదటి రోజు ఈ రికార్డు ని తన ఖాతాలో వేసుకుంది.

మొదట టాస్ గెలిచి బాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ భారీ స్కోర్ సాధించాలనే పట్టుదలతో మైదానంలోకి దిగింది.బాటింగ్ ఆరంభించిన ఇంగ్లాండ్ ను భారత స్పిన్నర్లు అష్టకష్టాలు పెట్టేసారు.కెరీర్లో వందో టెస్ట్ ఆడుతున్న ఇషాంత్ తొలి వికెట్ తీసి దెబ్బకొట్టారు.ఆ తర్వాత అక్షర్ 6 / 38 మరియు అశ్విన్ 3 /26 చెలరేగిపోయారు.దీనితో ఇంగ్లాండ్ 112 పరుగులకు అల్ అవుట్ అయిపొయింది. 90 పరుగులకు 3 వికెట్స్ కోల్పోయింది.దీంతో మొదటి రోజు మొత్తం 13 వికెట్స్ 211 పరుగులు నమోదమయ్యాయి. మరొకవైపు భారత్ లో ఇంగ్లిచ్ జట్టుకు ఒక టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఇది తక్కువ స్కోర్.