ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేసి ఇప్పటి వరకు తాళుత్తుతున్న చాల ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చారు.కేవలం నాలుగు వ్యూహాత్మక రంగాలు మినహా అన్ని ప్రభుత్వ సంస్థను ప్రైవేటీకరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నారు.వ్యాపారం అనేది అసలు ప్రభుత్వ వ్యవహారం లోకి రాదనీ, నష్టాల్లో ఉన్న సంస్థలు కూడా ప్రజాధనంతో నడుస్తున్నాయని, అలంటిరివతీకరించడమే ఉత్తమం అన్నారు.
నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను నడపడం కష్టతరమని…అలాంటి సంస్థలకు ఆర్ధిక సహాయం చేయడం వల్ల ప్రభుత్వం పై భారం పడుతుందని చెప్పారు.ప్రభుత్వమే స్వయంగా వ్యాపారం చేయవలసిన అవసరం అయితే ప్రస్తుతం లేదని చెప్పారు. సంపద సృష్టి, ఆధునికీకరణ నినాదంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అని మోడీ చెప్పారు.

ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించినప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు మొత్తం వేరని ,నష్టాల్లో ఉన్న సంస్థలు ఇప్పుడు భరించలేని భారం గా మారాయి. 50 – 60 ఏళ్ళ క్రితం విధానాలు ఇంకా అలాగే ఉన్నాయని , వాటిలో మార్పు తీసుకు రావడం అత్యవసరమని అభిప్రాయం వ్యక్తం చేసారు. ప్రజాధనాన్ని సద్వినియోగం చేయడం ముఖ్యమని, దానిని నష్టాల్లో ఉన్న సంస్థలకు ఖర్చు చేయడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని చెప్పారు.ప్రభుత్వం వైదొలిగే రంగాలను ప్రైవేట్ రంగం భర్తీ చేస్తుంది అన్నారు ఆయన.ఈ బడ్జెట్ లో దేశ ఆర్ధిక వ్యవస్థను వృద్ధి పథం లోకి తీసుకువెళ్లడమే ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.
లైఫ్ ఇన్సూరెన్సు కార్పొరేషన్ అఫ్ ఇండియాలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా పెట్టుబడులను ఉపసంహరించుకుంటామని కేంద్రం ఇంతకు ముందే ప్రకటించింది.ఎల్ ఐ సి తో పాటు రాబోయే రోజుల్లో ఎయిర్ ఇండియా,కంటైనర్ కార్పొరేషన్ అఫ్ ఇండియా,షిప్పింగ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్,పవన్ హన్స్,రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, నీలాచల ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తామని ఈ బడ్జెట్ సమయంలో వెల్లడించింది.