కుప్పం – పలమనేరు జాతీయ రహదారి పిఈయస్ ఆసుపత్రి సమీపంలో ప్రైవేటు బస్సు కారును ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు వి.కోట మండలం పట్రపల్లికి వాసులుగా పోలీసులు గుర్తించారు. డయాలసిస్ చెకప్ చేయించుకోవడానికి పీఈయస్ ఆసుపత్రికి వచ్చి వెనక్కి వెళ్తుండగా గణేష్ పురం వద్ద రోడ్డు ప్రమాదం చోటచేసుకుంది.
ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు.ఈ సంఘటన తర్వాత బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.