కరోనా ప్రభావం వల్ల దాదాపు ప్రపంచ దేశాలు అన్ని కూడా లాక్ డౌన్ ను విధించాయి. అలాగే భారత ప్రభుత్వం కూడా లాక్ డౌన్ ను విధించింది.కొన్ని రోజులపాటు అన్ని రకాల రవాణా వ్యవస్థలు నిషేంధించారు.అత్యవసర పరిస్థితులలో కొన్ని ప్రాంతాల్లో రేల్వే సేవలు పునరుద్ధరించారు.ఇప్పుడు లాక్ డౌన్ లో రద్దు చేసిన వాటిల్లో 11 జతల రైళ్లను పునరుద్ధరిస్తున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే బుధవారం ప్రకటించింది.వీటిల్లో ప్రయాణికు ఎక్కువగా ఉపయోగించే సికింద్రాబాద్ – విశాఖపట్నం, విశాఖపట్నం- సికింద్రాబాద్ ల మధ్య నడిచే ట్రైన్లు కూడా ఉన్నాయి.ఏ పి లోని విజయవాడ నుండి మహారాష్ట్రలోని షిర్డీ కు,సికింద్రాబాద్ నుండి బెంగుళూరు మరియు యశ్వంతపూర్, గుంటూరు – కాచిగూడకు కూడా రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి.ఇంకా హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో ఉన్న ఎం ఎం టి ఎస్ రైళ్లపై ఇంకా నిర్ణయం తీసుకోవలసి ఉంది.


తిరిగి పునఃప్రారంభించే రైళ్లలో అత్యధిక రైళ్లు ఏప్రిల్ 1 నుండి పట్టాలు ఎక్కుతున్నాయి.మిగిలినవి ఏప్రిల్ 2 – 7 తేదీల మధ్య ప్రయాణికులకు లభ్యమవుతాయి.22 రైళ్లలో ప్రతిరోజూ నడిచేవి 8 ,వారంలో మూడు రోజుల్లో నడిచే రైళ్లు ౨ ఉంటాయి.మిగిలిన 12 రైళ్లు వారానికి ఒకసారి నడుస్తాయని,తదుపరి ఆదేశాల వరకు ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది.