145 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయింది. భారత్ జట్టు లో రోహిత్ శర్మ తప్ప ఇంకెవరు రాణించలేదు. గుజరాత్ లోని మొతేరా స్టేడియంలో జరుగనున్న మూడవ డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ లో రెండవ రోజు టీమ్ ఇండియా 147 పరుగులకే ఆల్ అవుట్ అయి క్రికెట్ అభిమానులను నిరాశకు గురిచేసింది.ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 122 పరుగులకు ఆలౌట్ కాగా భారత్ 145 పరుగులకు ఆలౌట్ అయింది.

ఓపెనర్ శుభమన్ గిల్ 11, విరాట్ కోహ్లీ 27, చతుర్వేది పూజారా 0, అజింక్యా రహానే 7, రిషబ్ పంత్1, రవిచంద్రన్ అశ్విన్ 17, వాషింగ్టన్ సుందర్0, అక్షర పటేల్0, బూమ్రా ఒక పరుగు కి అవుట్ కాగా ఇషాంత్ శర్మ నాటౌట్ గా నిలిచారు. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ఐదు వికెట్లు తీశారు. దీనివల్ల టీమిండియాకు 33 పరుగుల స్వల్ప ఆధిక్యత లభించింది.