కెనరా బ్యాంకు డబ్బులు దొంగలించిన మేనేజర్ కు మెట్రో పోలిటన్ మేజిస్ట్రేట్ బుధవారం మూడేళ్ళ జైలు సిక్క్షతో పాటు రూ. 10 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.
ఈ కేసు లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపిన వివరాల ప్రకారం కెనరా బ్యాంక్‌ దిల్‌సుఖ్‌నగర్‌ బ్రాంచ్‌లో మేనేజర్‌గా వి.భాస్కర్‌రావు 2007 మార్చి–1 నుంచి మే–31 వరకు పని చేశారు. అదే బ్యాంక్‌లో ఏటీఎం కూడా నిర్వహిస్తున్నారు. సదరు ఏటీఎం సైతం మేనేజర్‌ భాస్కర్‌రావు ఆధీనంలోనే ఉండేది.
ఏటీఎంలో గత మూడు నెలలుగా రూ.10,34,500 నగదు తక్కువగా చూపిస్తున్న విషయాన్ని గమనించిన బ్యాంక్‌ ఉన్నతాధికారులు డిపార్టుమెంటల్‌ ఎంక్వైరీతో పాటు సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బ్రాంచ్‌ మేనేజర్‌ భాస్కర్‌రావు నిధులు నిర్వర్తించే సమయంలో మోసపూరితంగా డబ్బులు స్వాహా చేశారని వారి ఇన్వెస్టిగేషన్ లో తేలడంతో నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కోర్టులో అభియోగ పత్రాలను నమోదు చేశారు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన మెజిస్ట్రేట్‌ పైన చెప్పిన విధంగా తీర్పు వెల్లడించారు.