కృష్ణా జిల్లా నూజివీడు మండలంలో ఒక లారీ భీభత్సం సృష్టించగా సుంకాలు గ్రామానికి చెందిన మాగంటి నారాయణ, ఆర్ల వెంకటేశ్వరరావు, మాగంటి శ్రీనివాసరావుకు చెందిన 45 గొర్రెలు మృత్యువుని అనుసరించాయి…వీరు 200 గొర్రెలను గుడివాడ వైపు నుండి హనుమాన్ జంక్షన్ వైపునకు తోలుకు వెళ్తుండగా హనుమాన్ జంక్షన్ వైపు నుండి అతి వేగంతో వచ్చిన లారీ గొర్రెల మీద నుండి తొక్కుకుంటూ వెళ్ళింది. ఈ ఘటనలో 45 జీవాలు మృతి చెందాయి.లారీ డ్రైవర్ కనీసం ఆపకుండా వెళ్లిపోయాడని, వాహనం వారివైపు రావడం చూసి భయపడి పక్కకు వెళ్ళిపోయామని బాధితులు చెప్పారు.గొర్రెల విలువ రూ. 5 లక్షలు ఉంటుందని, వారు వాటి ప్రాణాలను కాపాడుకోలేకపోయామని బాధపడుతున్నారు.ఈ ఘటనలో నూజివీడు రురల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా ఎస్ఐ రంజిత్ కుమార్ తెలిపారు.