అమెరికన్ కార్మికుల అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని కారణంతో ట్రంప్ ప్రభుత్వం వలసదారులు అమెరికాలో ప్రవేశించడాన్ని నిషేధిస్తూ తీసుకొచ్చిన ఆదేశాలను ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ఉపసంహరించున్నారు. ఇది వీసా లబ్ధిదారులను ఇబ్బంది పెట్టడమే కాకుండా అమెరికా ఆర్ధిక వ్యవస్థకు నష్టం చేస్తుందని బైడెన్ వ్యాఖ్యానించారు. ఈ ఆదేశాలు అమెరికా నాగరికుల కుటుంబ సభ్యులతో కలవనివ్వకుండా చేస్తుంది కాబట్టి దేశానికి హాని చేస్తుందని ఆయన తెలిపారు.అమెరికా వ్యాపార సంస్థలు మెరుగైన ప్రతిభావంతులని వినియోగించుకోనివ్వకుండా చేస్తుంది, అంతే కాకుండా 2020 సంవత్సరం వీసాలు పొందిన వారికి, పొందాలనుకున్న వారికి నష్టాన్ని కలుగచేసింది అని బైడెన్ అన్నారు.
ది డైవర్సిటీ వీసా (గ్రీన్ కార్డు లాటరి) ప్రోగ్రాంపై ట్రంప్ నిర్ణయం తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపించింది.ఏటా 55 వేల మందికి గ్రీన్ కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.బైడెన్ది సరయిన నిర్ణయం అని, 5 లక్షల అర్హులైన వారు పెండింగ్ లో ఉన్నారని ఇమ్మిగ్రేషన్ అటార్నీ కర్టిస్ మారిసస్ వెల్లడించారు.