మహారాష్ట్రలో బుధవారం ఒక్కరోజే 32,855 కేసులు నమోదయ్యాయి. ఒక్క ముంబయి నగరంలోనే 5వేలకు పైగా కేసులు వెలుగుచూసాయి. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 1.87కోట్ల నమూనాలు‌ పరీక్షించగా 25.64లక్షల మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో 95 మంది మరణించగా, 15,098 మంది కోలుకొన్నారు. ప్రస్తుతం 2.47లక్షల వేల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.