క్రైమ్ (Crime) వార్తలు (News)

మరొక రైతు కుటుంబంతో సహా ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం మల్కపల్లిలో అప్పుల బాధతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జరిగింది. రమేశ్‌, పద్మ దంపతులు ఒక గదిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడడంతో కుమారుడు అక్షయ్‌(17), కుమార్తె సౌమ్య(19)మృతదేహాలు మరో చోట పడి ఉన్నాయి. ఇటీవలే కుమార్తె అత్తింటి నుంచి పుట్టింటికి వచ్చింది. ఇటీవల 30 ఎకరాల్లో పంట వేసి తీవ్రంగా నష్టపోయానని .. ఏం చేయాలో తెలియక ప్రాణం తీసుకుంటున్నట్టు రమేశ్‌ సూసైడ్‌ నోట్‌ రాసి పెట్టగా ఆత్మహత్య లేఖను పోలీసులు ఘటన స్థలంలోనే స్వాధీనం చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.