వార్తలు (News)

పుట్టిన రోజు వేడుకల్లో జర భద్రం….

‘పుట్టినరోజు’ స్నేహితులు, కుటుంబంతో కలిసి గ్రాండ్‌గా సెలబ్రెట్‌ చేసుకోవడంలో తప్పులేదు కానీ ఒక్కోసారి మనం చేసే చిన్న తప్పు విషాదంగా మారిపోయే అవకాశం ఉంటుంది. మహరాష్ట్రలో ఎంతో సంతోషంగా జరుపుకుంటున్న ఓ వ్యక్తి బర్త్‌డే పార్టీలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఒక యువకుడు ఈ నెల ప్రారంభంలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నప్పుడు కేక్‌ కటింగ్‌ సమయంలో స్ప్రే చల్లుతుండగా వెలుగుతున్న క్యాండిల్‌ కారణంగా ప్రమాదవశాస్తు ముఖానికి మంట అంటుకుంది. ఆ వెంటనే అప్రమత్తమైన వ్యక్తి కంగారుగా వెనకకు పరిగెత్తడంతో భయాందోళనకు గురైన అతని స్నేహితులు మంటను ఆర్పేందుకు ప్రయత్నించారు.

ఇదంతా అక్కడున్న వ్యక్తి వీడియో తీస్తుండగా రికార్డయ్యింది. ఒళ్లు జలదరించే ఈ వీడియోను పునేట్రావెల్క్స్ అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పోస్ట్‌ చేశారు. పార్టీల సందర్భంగా చల్లే ఫోమ్స్‌పట్ల జాగ్రత్తగా ఉండాలని, “‘పుట్టినరోజు స్నో ఫోమ్‌ ఉపయోగించవద్దు. దాని నురుగు కంటికి మంచిగానే కనిపిస్తుంది కానీ రసాయనాలను కలిగి ఉండి మండే గుణం ఉండటం వల్ల కంటికి ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇక చాలా స్ప్రే బాటిల్స్‌పై హెచ్చరిక సంకేతాలు కూడా ఉంటాయి. అందులో మంటల వద్ద స్పే చేయవద్దని సూచిస్తుంది”. అయినప్పటికీ పుట్టిన రోజు వంటి వేడుకల్లో కొవ్వుత్తులు మండుతుండగా స్నో ఫోమ్స్‌ను స్ప్రె చేస్తుండడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి.’ అని పేర్కొన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.