ఏపీలో 24 గంటల వ్యవధిలో 35,196 నమూనాలను పరీక్షించగా 758 మందికి కొవిడ్‌ నిర్ధారణ కావడంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,95,879కి చేరింది. కొత్తగా నమోదైన కేసులో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 175, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో ఇద్దరు, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందడంతో కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 7,201కి చేరింది. రాష్ట్రంలో ఒక్కరోజులో 231 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 3,469 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,48,75,597 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.