తెలంగాణలో నిన్న రాత్రి 8 గంటల వరకు 56,464 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తే 493 పాజిటివ్‌ కేసులు నమోదవ్వడంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,04,791కి చేరింది. నిన్న కొవిడ్‌తో నలుగురు మృతిచెందడంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1680కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 157 మంది కోలుకోవడంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,99,427కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,684 ఉంటె వీరిలో 1,616 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 138 కేసులు నమోదయ్యాయి.