దేశీయ చమురు సంస్థలు లీటర్‌ పెట్రోల్‌పై 21పైసలు, డీజిల్‌పై 20 పైసలు తగ్గిస్తూ నిర్ణయించాయి. వరుసగా రెండో రోజు కూడా ఇంధన ధరల్లో స్వల్పంగా తగ్గుదల కనిపించడంతో ప్రజలు ఊపిరి తీసుకుంటున్నారు. దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర నిన్న రూ.90.99 ఉండగా.. 21పైసలు తగ్గి రూ.90.78కి చేరింది. ఇక డీజిల్‌ ధర రూ.81.30 ఉండగా.. 20 పైసలు తగ్గి రూ.81.10 చేరింది. ఇక హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌,డీజిల్‌పై 22పైసలు చొప్పున తగ్గింది. దీంతో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.39గా, డీజిల్‌ ధర రూ.88.45గా నమోదైంది.

ఇంధన ధరలు:

నగరం పెట్రోల్‌ ధర లీ.డీజిల్‌ ధర లీ.
దిల్లీ రూ.90.78   రూ.81.10
చెన్నై రూ.92.77 రూ.86.10
బెంగళూరు రూ.93.82 రూ.85.99
ముంబయి రూ.97.19 రూ.88.20