వార్తలు (News)

గిన్నిస్‌బుక్‌లో చోటు దక్కించుకోబోతున్న గుంటూరు చిన్నారి

తొమ్మిదేళ్ల చిన్నారి కనబరిచిన అద్భుత ప్రతిభను గుర్తించిన గిన్నిస్‌ బుక్ ప్రతినిధులను అబ్బురపరిచింది. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన తొమ్మిదేళ్ల ఫజీలా తబస్సుం ఆవర్తన పట్టికను అతి తక్కువ సమయంలో అమర్చి తన ప్రతిభ చాటుకుంది. ఫజీలా తబస్సుం ఇప్పటికే ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటుసంపాదించుకొంది. ఇప్పుడు అతిత్వరలో చిన్నారి పేరును గిన్నిస్‌బుక్‌లో అధికారికంగా ప్రకటించనున్నారు. ఎమ్మెల్యే విడదల రజిని సమక్షంలో 1.27 నిమిషాలలో మూలకాలను అమర్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా చిన్నారిని ఎమ్మెల్యే సత్కరించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.