దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో మన దేశ అవసరాల రీత్యా కొద్ది రోజులపాటు కొవిషీల్డ్‌ టీకాలను పెద్ద ఎత్తున ఎగుమతి చేయడాన్ని నిలిపివేయాలని కేంద్రం భావిస్తోందని తెలుస్తోంది. దేశ అవసరాల రీత్యా కొవిషీల్డ్‌ టీకాలను సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఉత్పత్తి చేస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న వేళ వ్యాక్సినేషన్‌ పక్రియను వేగవంతం చేసే పనిలో కేంద్రం నిమగ్నమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారుగా భారత్‌ ఉన్న నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్‌ సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉంది.